Header Banner

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

  Thu Apr 24, 2025 10:58        Others

యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ తుది ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో శ్రీకాకుళంకి చెందిన తెలుగు కుర్రోడు సత్తా చాటాడు. ఏకంగా 15వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కొలువును దక్కించుకున్నాడు. గతంలోనే IPSకి సెలక్ట్‌ అయి ప్రస్తుతం శిక్షణలో ఉంటూనే IASకు ప్రిపేరై కలల కొలువును దక్కించుకున్నాడు.

 

పట్టుదల, దృఢ సంకల్పం ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏమి ఉండదు. కార్యసాధనలో ఒక్కోసారి ఓటమి ఎదురయినా నిరాశపడకూడదు. అవి తాత్కాలికమే అనుకుని ముందడుగు వేస్తూ పోవాలి. అనుకున్నది సాధించెంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడు తప్పకుండా ఏదో ఒకరోజు విజయం మన సొంతం అయి తీరుతుంది. అనుకున్నది తప్పక నెరవేరుతుందని నిరూపించాడు సిక్కోలు జిల్లాకు చెందిన బాన్న వెంకటేష్. 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా లెవల్ లో 15వ ర్యాంక్ సాధించి తెలుగోడి సత్తా చాటాడు.

 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రికి బిగ్ షాక్! ఆ కేసులోనే ఆమె మరిది అరెస్ట్ !

 

బాన్న వెంకటేశ్‌ స్వస్థలం జలుమూరు మండలంలోని అల్లాడపేట అనే మారుమూల గ్రామం. వారిది ఓ సాధారణ రైతు కుటుంబం. కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల నుండి స్ఫూర్తి పొందాడు వెంకటేష్. చిన్నప్పటి నుండి చదువుల్లో చురుకుగా ఉండే వెంకటేష్ IAS కావాలని భావించాడు. ఒకటి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం అంతా శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగింది. ఇంటర్ విశాఖలో పూర్తిచేశాడు. IIT ఖరగ్ పూర్ లో సివిల్ లో సీటు వచ్చినప్పటికీ గ్రూప్ నచ్చక తమిళనాడు లోని NIT తిరుచనాపల్లిలో తన ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అనంతరం సాప్ట్ వేర్ ఇంజినీర్ గా రెండేళ్లు పూర్తి చేసి సివిల్స్ రాయాలన్న ఆశయంతో ఆ జాబ్ కి రిజైన్ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.

 

తొలి ప్రయత్నంలో వెంకటేష్ విఫలం అయ్యాడు. దగ్గరలోనే ఆయనకు సివిల్స్ ర్యాంక్ మిస్సైంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మళ్లీ ప్రయత్నం చేసాడు. 2023 సివిల్స్ ఫలితాల్లో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికయ్యాడు వెంకటేష్. ప్రస్తుతం హైదరాబాద్లో IPS శిక్షణలో ఉన్నాడు. అయితే IAS కావాలన్న సంకల్పంతో IPS శిక్షణ పొందుతూనే మరల సివిల్స్ పరీక్షలు రాయాగా 2024 సివిల్స్ ఫలితాల్లో ఏకంగా ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించాడు. దీంతో వెంకటేష్ కి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు వెంకటేష్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆయన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యువతకు వెంకటేష్ స్ఫూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు.

 

ఇది కూడా చదవండి: మద్యం స్కామ్’లో కీలక మలుపు! మరో కీలక నిందితుడి అరెస్ట్‌.. వైసీపీ నెట్‌వర్క్‌కి ఉచ్చు బిగుస్తుందా? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

లోక్‌సభ మహిళా సాధికారత కమిటీలో దక్షిణం నుంచి ఆ ముగ్గురు నేతలు! మహిళల అభివృద్ధికి కొత్త దిశ!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #BannaVenkatesh #UPSC2024 #IASRank15 #TeluguSuccessStory #CivilServicesJourney #UPSCInspiration